
ఎక్కువ.. ఎందుకిలా? Missing Cases in Telangana: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మనుషులు మాయం అయిపోతున్నారు అదృశ్యమవుతున్నవారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయసువారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన హజీపూర్ ఉదంతం ఇంకా మరుగునపడకముందే పెరిగిపోతున్న అదృశ్యం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మనుషులు మాయం అయిపోతున్నారు. హాజీపూర్ ఉదంతం సహా ఎన్నో ఘటనల్లో ఎంతో మంది కనిపించడం లేదు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. మాయమైపోతున్న వారిలో ఎక్కువ మంది యువతులే కావడం గమనార్హం. ఈనాడు పత్రిక కథనం ప్రకారం.. రాష్ట్రంలో సగటున రోజుకు 60 మంది వరకు అదృశ్యమైపోతున్నారు. ఈ నెలలో 9వ తేది వరకు 545 మంది కనిపించకుండా పోయారు. ఇవి పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు మాత్రమే. వీరిలో సగం మందికి పైగా రాజధాని పరిసరాలకు చెందిన వారేనట. ఇంతమంది ఎందుకు అదృశ్యమవుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది బాధితుల కుటుంబ సభ్యులనే కాదు పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.అదృశ్యమవుతున్నవారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి 80...