ఎక్కువ.. ఎందుకిలా?
Missing Cases in Telangana:
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మనుషులు మాయం అయిపోతున్నారు
అదృశ్యమవుతున్నవారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయసువారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన హజీపూర్ ఉదంతం ఇంకా మరుగునపడకముందే పెరిగిపోతున్న అదృశ్యం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎందుకిలా జరుగుతోందంటే..
పరీక్ష ఫలితాల వెల్లడి సమయంలో ఎక్కువగా మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. ఇలా వెళ్లిన పిల్లల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా తిరిగి వచ్చేస్తుంటారు. ప్రేమ వ్యవహారాలు మరో కారణం. మిస్సింగ్ కేసులలో ఎక్కువశాతం ఇలాంటివే ఉంటున్నాయి. ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులమీద అలిగి వెళ్లిపోతుంటారు. మధ్యవయసు వారయితే అప్పులు, ఇతర ఆర్థిక కారణాల వల్ల ఎవరికి చెప్పకుండా వెళ్లిపోతున్నారు. పిల్లలు తమను సరిగా చూడటంలేదని చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోతున్న వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక, బాలికలను, యువతులను, మహిళలను కిడ్నాపర్లు లక్ష్యంగా చేసుకొని ఎత్తుకెళ్తున్నారు.
Comments
Post a Comment