మే డే ఎలా ప్రారంభమయ్యింది.
ప్రపంచ కార్మిక పోరాటాలకు నిలయం మేడే. 1886 మే 1న ఇది మొట్టమొదటి సారిగా చికాగోలో పెట్టుబడిదారుల శ్రమదోపిడి నిరసిస్తూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ కార్మికులు శంఖారావం పూరించారు. ప్రతి రోజు ఎనిమిది గంటలు మాత్రమే పని గంటలు ఉండాలని నిరసిస్తూ ఈ సమ్మెకు దిగారు. ఈ యొక్క సమ్మె ఉద్రిక్తంగా మారడంతో ఎంతో మంది కార్మికులు చనిపోయారు చివరికి వారి యొక్క హక్కులను సాధించుకున్నారు. వారి స్ఫూర్తి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాం. కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు