జేఈఈ మెయిన్స్ 2019 ఫలితాలలో తెలుగు విద్యార్థుల హవ:
దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి.
ఏటా ఒకేసారి మెయిన్స్ పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఈసారి రెండు సార్లు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఏప్రిల్‌లో నిర్వహించిన రెండో విడత పరీక్ష స్కోర్‌తో పాటు ర్యాంకులను వెల్లడించింది.
ఈ ఫలితాల్లో దిల్లీకి చెందిన శుభాన్ శ్రీవాస్తవ తొలి ర్యాంకు సాధించగా.
కర్ణాటకకు చెందిన కెవిన్ మార్టిన్ రెండు, మధ్యప్రదేశ్‌కు చెందిన ధృవ్ అరోరా మూడో ర్యాంకు సాధించారు.
{ తెలంగాణకు మొదటి పది ర్యాంకుల్లో మూడు ర్యాంకులు వరించాయి.}
బెట్టుపాటి కార్తీకేయకు ఐదో ర్యాంకు, ఆదెళ్ల సాయి కిరణ్‌కు ఏడో ర్యాంకు, కె. విశ్వనాథ్‌కు ఎనిమిదో ర్యాంకు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండా రేణు తొమ్మిదో ర్యాంకు సాధించగా.. తెలంగాణకు చెందిన ఇందుకూరి జయంత్ ఫణిసాయి 19వ ర్యాంకు, ఏపీకి చెందిన బొజ్జా చేతన్ రెడ్డికి 21వ ర్యాంకు వచ్చాయి.
గతేడాది డిసెంబరులో తొలిసారి జరిగిన మెయిన్స్ ఎగ్జామ్‌కు సుమారు పదిన్నర లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈ నెల 7 నుంచి ఐదు రోజులపాటు జరిగిన రెండో విడత పరీక్షకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండుసార్లు పరీక్ష రాసిన వారు 6.5 లక్షల మంది ఉన్నారు.
ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకుని జాతీయ పరీక్షల సంస్థ ఈ ర్యాంకులను ప్రకటించింది.
Comments
Post a Comment