Telangana common postgraduate entrance test dates released




దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని 7 యూనివర్సిటీలకు కామన్ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్ (ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష) నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపి రెడ్డి తెలిపారు.

 ఇవాళ పాపిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఉస్మానియా యూనివర్సిటీ ‌ఆధ్వర్యంలో కామన్ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు యూనివర్సిటీల్లో 80 కోర్సుల అడ్మిషన్లు కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జేఎన్టీయూలోని ఎమ్మెస్సీ అడ్మిషన్లకు కూడా కామన్ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్ ద్వారా సీట్లను భర్తీ చేయడం జరుగుతుందన్నారు.*

ఈ పరీక్షల కోసం 25 ఆన్ లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మే‌ 30 వరకు ఫీజు చెల్లింపునకు తుదిగడువుగా నిర్ణయించామని, జాన్ 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని పాపిరెడ్డి వెల్లడించారు.

Comments

Popular posts from this blog

పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన దారుల్షిఫా ప్రభుత్వ పాఠశాల అంధ విద్యార్థులు

What is after SSC and Intermediate