విడుదలైన ఇంటర్మీడియట్ రీ వెరిఫికేషన్ ఫలితాలు కొత్తగా 1137 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారుp
విడుదలైన ఇంటర్మీడియట్ రీ వెరిఫికేషన్ ఫలితాలు కొత్తగా 1137 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు
హైదరాబాద్: ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలపై ఉత్కంఠకు తెరపడింది. రీవెరిఫికేషన్‌లో మొత్తం 1137 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థుల్లో 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్ పూర్తి అయినట్టు బోర్డు వెల్లడించింది. ఇంకా 19, 788 జవాబు పత్రాల స్కానింగ్ పూర్తి కావాల్సి ఉందని వివరించింది. ఈ పత్రాల అప్‌లోడ్ ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేస్తామని బోర్డు తెలిపింది. రీవెరిఫికేషన్‌లో 585 మంది మొదటి సంవత్సరం, 552 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
విద్యార్థుల జవాబు పత్రాలు వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది విద్యార్థులు చూసుకోగలరు.
Website: http://bie.telangana.gov.in/
ఇటీవల ఇంటర్ ఫలితాలు జరిగిన గందరగోళం గురించి అందరికీ తెలుసు అలా చేసే తప్పు మరి ఎప్పుడు జరుగుతుంది ఇంటర్ బోర్డు చాలా పకడ్బందీగా ఫలితాలు విడుదల చేసింది
ఈ ఫలితాల కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి ఆ సాఫ్ట్ వేర్ తో ఫలితాలను ఒకటికి రెండు మార్లు సెట్ చేసి వెబ్సైట్లో ఉంచింది
ఏమైనా సందేహాలు ఉంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు మెయిల్ చేయగలరు.
Comments
Post a Comment