పెరిగిపోతున్న గురుకులం స్వేరోస్ ఆగడాలు, గురుకులాలా..? మతమార్పిడి కేంద్రాలా

పెరిగిపోతున్న గురుకులం స్వేరోస్ ఆగడాలు

*🅾గురుకులాలా..? మతమార్పిడి కేంద్రాలా?*

lస్వేరోస్‌ సంస్థను నిషేధించాలి

'భారతదేశం నా మాతృభూమి'కి బదులు స్వేరోస్‌ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు

ప్రవీణ్‌కుమార్‌ పాలనపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలి

ఎన్‌ఎ్‌ససీఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు శ్రీశైలం

పంజాగుట్ట/హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు సమస్యలతో సతమతమవుతున్నాయని, స్వేరోస్‌ సంస్థ ఆగడాలు మితిమీరుతున్నాయని.. ఆ సంస్థను నిషేధించాలని జాతీయ ఎస్సీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి(ఎన్‌ఎ్‌ససీఆర్‌పీఎస్‌) డిమాండ్‌ చేసింది.


మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం మాట్లాడారు. రెండు రోజుల క్రితం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి అందజేసిన వినతిపత్రంలోని వివరాలను వెల్లడించారు. ప్రస్తుత కార్యదర్శి, ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఏడేళ్లుగా విద్యాపరంగా కొన్ని విజయాలు అందుకున్నమాట వాస్తవమేనని.. అయితే పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడంతో అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. స్వేరో్‌సను అధికారిక సంఘంగా మల్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. గురుకులాల్లో వివిధ కాంట్రాక్టులను స్వేరోస్‌ సంస్థకు ఇవ్వడం చట్టవిరుద్ధమని చెప్పారు. అవి గురుకులాలా? మతమార్పిడి కేంద్రా లా అని ప్రశ్నించారు. అక్కడ దేశ వ్యతిరేక భావాలను నేర్పుతున్నారని ఆరోపించారు. గురుకులాల్లో భారతదేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞ చదవడాన్ని నిషేధించిన ప్రవీణ్‌కుమార్‌.. దానికి బదులుగా స్వేరోస్‌ ప్రతిజ్ఞ చేయిస్తున్నారన్నారు. మతం పేరుతో విద్యార్థులకు గుండు కొట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలేవీ గురుకులాల్లో అమలు చేయడం లేదన్నారు.
'నమస్కారం' అని చెప్పకుండా 'జై భీం' అని మాత్రమే చెప్పాలని విద్యార్థులకు నేర్పుతున్నారన్నారు. కాంట్రాక్టుల పేరిట కొందరు స్వేరోస్‌ ప్రతినిధులు గురుకులాల్లోకి ప్రవేశించి బాలికలను కిడ్నాప్‌ చేయడమేగాక వారిపై అత్యాచార యత్నాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులను, సిబ్బందిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. బతుకమ్మ పండగ మనది కాదంటూ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటన ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దసరా, దీపావళి, శ్రీరామనవమి, ఉగాది పండుగలకు గురుకులాల్లో సెలవులు ఇవ్వడంలేదన్నారు. ప్రవీణ్‌కుమార్‌ పాలన, స్వేరోస్‌ సంస్థ కార్యకలాపాలపై సీఐడీచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్నారు.
శ్రీశైలంపై దాడి
శ్రీశైలం మీడియాతో మాట్లాడుతుండగానే 10 మంది ఆగంతుకులు హాల్లోకి వచ్చి ఆయనపై దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకోబోయిన మీడియా ప్రతినిధులపైనా దాడి చేశారు. శ్రీశైలం, మిగతావారు బయటికి పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. అనంతరం మరో 10 మందికిపైగా అక్కడికి చేరుకుని వీరంగం సృష్టించారు. పోలీసులు వచ్చి శ్రీశైలంపై దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైలం ఫిర్యాదు మేరకు ఓయూ విద్యార్థి అలెగ్జాండర్‌, అనిల్‌తోపాటు మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్రీశైలంతో పాటు అతని అనుచరులు తనపై దాడి చేశారని అలెగ్జాండర్‌ కూడా ఫిర్యాదు చేశారు. దళిత నేత శ్రీశైలంపై స్వేరోల దాడిని ఖండిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఏ.కిరణ్‌ తెలిపారు.

Comments

Popular posts from this blog

పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన దారుల్షిఫా ప్రభుత్వ పాఠశాల అంధ విద్యార్థులు

What is after SSC and Intermediate