ఎంపీ కిషన్ రెడ్డి విద్యార్థుల కోసం చేస్తున్న కృషిని అందరూ మెచ్చుకుంటున్నారు పుస్తకాలు ముద్దు బొకేలు వద్దంటున్న సికింద్రాబాద్ ఎంపీ
సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన జి.కిషన్ రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తనను అభినందించడానికి వస్తున్న మిత్రులు, కార్యకర్తలు, అభిమానులు.. ఫ్లవర్ బోకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని, వాటికయ్యే ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ బుక్స్ తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి అనూహ్య స్పందన వస్తోంది. ఒక్క పూటలోనే అనేక మంది వేలాది పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చారు.
తన మనవిని మన్నించి పుస్తకాలు తీసుకువచ్చిన వారికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించిన తర్వాత విద్యార్థులకు పంపిణి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఒక కొత్త ఒరవడికి పునాది వేస్తున్నా కిషన్ రెడ్డి గారిని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు మరి ఇతని చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాలని అంటున్నారు.
ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో ఇలా సమాజానికి సేవ చేసే ఆలోచన వస్తే మన దేశం మరో బంగారు బావి నుంచి మార్చి అనడంలో ఎలాంటి సందేహం లేదు
Comments
Post a Comment