మరో వివాదంలో చిక్కుకున్న ఇంటర్ బోర్డు
మరో వివాదంలో చిక్కుకున్న ఇంటర్ బోర్డు:
ఇంటర్ ఫలితాలల్లో జరిగిన అవకతవకల వల్ల విద్యార్థులు చనిపోయారనది వాస్తవం కాదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
అశోక్ కుమార్ వాఖ్యలపై జనాలు మండిపడుతున్నారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఫలితాలలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని వారి పేపర్లను రీ వెరిఫికేషన్ చేశామన్నారు.
85 మార్కులు వచ్చిన విద్యార్థినీ కూడా ఆత్మహత్య చేసుకుందని అలాగే అన్ని పరీక్షకు హాజరైన ఒక విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుందని అన్నారు.
మేలో రెండవ లేదా మూడవ వారంలో రీ వెరిఫికేషన్ ఫలితాలను విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఫలితాలను వెబ్సైట్లో ఉంచడానికి ముందు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ద్వారా రీ చెక్ చేస్తున్నామని,
దీని కోసం ఒక జాతీయ కంప్యూటర్ సంస్థ యొక్క సహాయం కూడా తీసుకుంటున్నామని తెలియజేశారు.
విద్యార్థులు తల్లిదండ్రులు ఫలితాలపై ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు.
Comments
Post a Comment