తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం
*🏵తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం...*
*తెలంగాణ రాష్ట్రంలో 194 విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో మోడల్ స్కూల్ ప్రారంభించడం జరిగింది.. వాటిలోని జూనియర్ కళాశాలలు కూడా ప్రారంభించడం జరిగింది...M.P.C,Bi.P.C,M.E.C,CEC కోర్సులు... పదవ తరగతి GPA ఆధారంగా ప్రవేశాలు*
*🌷ఈ కళాశాలలో ఎలాంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు*
*🌹ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది*
*🌺అన్ని వసతులతో కూడిన పక్కా బిల్డింగ్ లు కలవు*
*🌸ఉచితంగా పాఠ్యపుస్తకాల అందజేస్తారు*
*🌻లైబ్రరీ మరియు సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ లు కలవు*
*🌱రాష్ట్ర ప్రభుత్వం జీవో మేరకు రిజర్వేషన్లు పాటిస్తారు*
బాలికలకు హాస్టల్ సదుపాయం కూడా కలదు.
*విద్యార్థులు tsmodelschools.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సైట్ లోని అప్లికేషన్లు అన్ని వివరాలు నింపి, ఫోటో మరియు సంతకాన్ని అప్లోడ్ చేయాలి.
అన్ని వివరాలు సరి చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ తో పాటు ssc marks memo, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ ఇతర అవసరమైన ధ్రువపత్రాలను జతపరిచి పాఠశాల ప్రిన్సిపాల్ కి అందజేయాలి.
విద్యార్థి చదివిన 9, 10వ తరగతి మండలాన్ని అతని స్థానిక మండలం గా పరిగణిస్తారు.
పాఠశాలలోని PGT లతో కమిటీ ఏర్పాటు చేసి అర్హత గల వారి లిస్టు ప్రకటిస్తారు.
అదనంగా 20 శాతం మంది విద్యార్థులతో వెయిటింగ్ లిస్ట్ కూడా ప్రచురిస్తారు.
ఎంపిక జాబితా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాధికారి చే ఆమోదం పొందడం జరుగుతుంది.
సెలక్షన్ లిస్ట్ పాఠశాలల నోటీస్ బోర్డ్ పై ప్రదర్శించడం జరుగుతుంది
సెలక్షన్ లో రిజర్వేషన్, స్థానిక మండలాన్ని ప్రాధాన్యత పాటిస్తారు.. స్థానిక మండలం వారు అందుబాటులో లేకపోతే ఇతర మండలాల వారికి కూడా సీట్లు కేటాయిస్తారు.
అప్లికేషన్లు అన్ని వివరాలు సరిగ్గా సబ్మిట్ చేసి దరఖాస్తు చేయాలి..అప్లికేషన్లో తప్పులకు విద్యార్థి మాత్రమే బాధ్యత వహించవలసి ఉంటుంది.
ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసే తేదీలు 14. 5 .2019 నుండి 24. 5. 2019
అప్లై చేసుకున్న విద్యార్థుల జాబితా ప్రచురించేది 25. 5 .2019*
*సెలెక్ట్ చేయబడిన విద్యార్థుల జాబితా పాఠశాలల వద్ద ప్రదర్శించేది 26. 5 .2019 నుండి 28. 5. 2019 వరకు*
ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసేది 29 .5 .2019 నుండి 31 .5. 2019
తరగతులు ప్రారంభించేది 1 .6 .2019 నుండి..
SOURCE:Rajeshwar (Medal)
Comments
Post a Comment